వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

  • ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ రాజీనామా
  • ఏప్రిల్-6న రాజీనామా లేఖలు సమర్పించిన వైసీపీ ఎంపీలు
  • ఇటీవల రాజీనామాలు ఆమోదించాలని ఢిల్లీకి వెళ్లొచ్చిన నేతలు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఎంపీలు వరప్రసాద్ రావు, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు ఈ ఏడాది ఏప్రిల్-6న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖలు సమర్పించిన విషయం విదితమే. ఈరోజు సుమిత్రా మహాజన్.. వారి రాజీనామాలను ఆమోదించారు.

ఇటీవల స్పీకర్ పిలుపుపై ఢిల్లీకి వెళ్లిన వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని, నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తానని ఆమె అప్పట్లో అన్నారు. అయినప్పటికీ ఎంపీలు తమ రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టడంతో స్పీకర్ ఈరోజు వాటిని ఆమోదించారు.
YSRCP
mps

More Telugu News