Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వర్మ 'భైరవగీత' మోషన్ టీజర్ రిలీజ్

  • సిద్ధార్థ దర్శకత్వంలో 'భైరవగీత'
  • నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ 
  • ప్రధానమైన పాత్రలో ధనుంజయ
రామ్ గోపాల్ వర్మ ఈ సారి ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టేశాడు. తెలుగు .. కన్నడ భాషల్లో ఆయన ఈ సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. తెలుగులో 'భైరవగీతం' .. కన్నడలో 'భైరవగీత' అనే టైటిల్స్ ను ఖరారు చేశాడు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ వేడుకలో క్రిటిక్ కేటగిరి నుంచి ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్న 'ధనుంజయ' ను ఆయన కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నాడు.

కొంత సేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఆయన మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీ అని ఈ మోషన్ టీజర్ ద్వారా వర్మ చెప్పినప్పటికీ .. అప్పటికే కొంతమందిని నరికేసిన గొడ్డలితో పగతో రగిలిపోతూ ఒక వ్యక్తి కనిపిస్తుండటం విశేషం. ఇక నేపథ్య సంగీతం కూడా భయపెట్టేదిగానే వుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఒక యువకుడు ఎలా రెబల్ గా మారాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందనీ, సిద్ధార్థ అనే కుర్రాడు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడని ఆయన చెప్పారు.
dhanunjaya

More Telugu News