'సుధీర్‌ని పెళ్లి చేసుకో' అన్న నెటిజన్.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన యాంకర్‌ రష్మీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సుధీర్‌ని పెళ్లి చేసుకో' అన్న నెటిజన్.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన యాంకర్‌ రష్మీ!

  • మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు
  • మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?
  • రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి
  • మేము స్క్రీన్‌పై చేసేదంతా వినోదాన్ని అందించడం కోసమే
బుల్లితెరపై యాంకర్‌ రష్మీ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఆమె పలు ప్రోగ్రాముల్లో యువ నటుడు, యాంకర్‌ సుధీర్‌తో కలిసి యాంకరింగ్‌ చేస్తూ అలరిస్తోంది. ఇటీవల ప్రసారం అయిన ఓ షోలో వారిద్దరూ సరదాగా పెళ్లి చేసుకున్నట్లు కూడా చూపించారు. కాగా, ట్విట్టర్‌లో ఓ అభిమాని రష్మీకి ఓ సలహా ఇచ్చి కోపం తెప్పించాడు. 'సుధీర్‌ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు'.. అని ఓ అభిమాని రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు.

దీంతో స్పందించిన రష్మీ 'మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మాకు మీ నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు' అని పేర్కొంది. 
rashmi
sudheer
Twitter

More Telugu News