242 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా... దుమ్మెత్తి పోస్తున్న అభిమానులు!
- ఒకప్పుడు ఐదుసార్లు చాంపియన్
- ఇప్పుడు ఆరోస్థానానికి దిగజారిన ఆస్ట్రేలియా
- ఇంగ్లండ్ తో ఓటమిపై విమర్శల వర్షం
ఇక తాజాగా, నిన్న జరిగిన వన్డే పోరులో ఇంగ్లండ్ తో తలపడి 242 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియాపై ఆ దేశ క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆస్ట్రేలియా ఫీల్డర్ల కన్నా బంతిని మైదానంలోని ప్రేక్షకులే ఎక్కువగా ఆపారని ఎద్దేవా చేస్తున్నారు. తమ జట్టును మోస్ట్ చాలెంజింగ్ జట్టుగా చూసిన కళ్లతో ఇప్పుడిలా థర్డ్ గ్రేడ్ జట్టుగా చూడలేకపోతున్నామని వాపోతున్నారు. ఓడిపోవడాన్ని తట్టుకోవచ్చుగానీ, ఇలా ఓడిపోవడాన్ని తట్టుకోలేమని అంటున్నారు. ఆస్ట్రేలియా జట్టు తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టుల వర్షాన్ని కురిపిస్తున్నారు.