ఇప్పటికే డిబేట్లలో నీళ్లు తాగించా.. ఇదేం ఇబ్బంది కాదు!: బాబు గోగినేని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పటికే డిబేట్లలో నీళ్లు తాగించా.. ఇదేం ఇబ్బంది కాదు!: బాబు గోగినేని

  • వారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్2
  • ఎలిమినేట్ అయిన సంజన
  • బాబు గోగినేనిపై బిగ్ బాంబ్ ప్రయోగం
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 2వ సీజన్ అప్పుడే వారం పూర్తి చేసుకుంది. తొలివారం ఎలిమినేషన్ రౌండ్ లో మిస్ హైదరాబాద్ సంజన ఎలిమినేట్ అయింది. షో నుంచి వెళుతూ వెళుతూ బిగ్ బాంబ్ ను బాబు గోగినేనిపై సంధించింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి మంచి నీటిని బాబు గోగినేనే తీసుకువెళ్లి ఇవ్వాలి. కంటెస్టెంట్ లు సొంతంగా నీటిని తీసుకోకూడదు.

ఈ టాస్క్ ను బాబు సంతోషంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ షోలోకి రాకముందు తాను అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నానని చెప్పారు. డిబేట్లలో ఒక్కొక్కరికి మూడు చెరువుల నీరు తాగించానని, అలాంటి తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదని తెలిపారు. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అన్నింటినీ కచ్చితంగా ఫాలో అవుతానని చెప్పారు. సంజన తనపై బిగ్ బాంబ్ ను ఎందుకు ప్రయోగించిందో తెలియదని... ఆమెను తాను ఎలాంటి ఇబ్బందికి గురి చేయలేదని తెలిపారు. ఆమె తనపై కోపం ఎందుకు పెంచుకుందో తెలియదని చెప్పారు. 
bigboss2
telugu
babu gogineni
sanjana

More Telugu News