సినిమాల్లో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల.. మణికంఠ సాయి కోసం పోలీసుల వేట!
- అగ్ర దర్శకుడి పీఏనని చెప్పుకున్న మణికంఠ సాయి
- ఫిల్మ్ నగర్ లో నిందితుడి బారినపడ్డ అమ్మాయిలు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
తన భార్య అతనితో ఉన్న సమయంలో ఫొటోలు తీసి, వాటిని ఇంటర్నెట్ లో పెడతానని అతను బెదిరించాడని సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని ఎంతోమంది స్థానిక అమ్మాయిలను మోసం చేశాడని, అందినంత డబ్బు దోచుకుంటూ, తన కోరికను తీర్చుకుంటున్నాడని ఆరోపించాడు. బాధితులకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.