మోదీని ఉద్దేశించి మరోసారి వ్యంగ్యంగా ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీని ఉద్దేశించి మరోసారి వ్యంగ్యంగా ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్

  • ఫిట్ నెస్ ఛాలెంజ్ లు, యోగాలతో మీరు బిజీగా ఉన్నారనే విషయం మాకు తెలుసు
  • చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా చూడండి
  • కేజ్రీవాల్ తో కలసి పని చేయాలని అధికారులను ఆదేశించండి
అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ, బీజేపీలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక ఎన్నికల్లో ఆయన ఏ పార్టీకీ మద్దతు ప్రకటించకపోయినప్పటికీ... బీజేపీని ఓడించాలంటూ సొంతంగా ప్రచారం మాత్రం నిర్వహించారు. తాజాగా మోదీపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా మరోసారి విమర్శలు కురిపించారు.

"డియర్ సుప్రీమ్ లీడర్, ఫిట్ నెస్ ఛాలెంజ్ లు, యోగా, ఎక్సర్ సైజులతో మీరు చాలా బిజీగా ఉన్నారనే విషయం మాకు తెలుసు. ఒక్క క్షణం గుండెల నిండా ఊపిరి పీల్చుకొని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి ప్రభుత్వ అధికారులు పనిచేయాలంటూ ఆదేశించండి. (కేజ్రీవాల్ చేస్తున్నవి మంచి పనులే). ఆ తర్వాత ఎక్సర్ సైజ్ చేయండి. మీ డ్యూటీని కూడా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Prakash Raj
modi
tweet
Arvind Kejriwal

More Telugu News