ఓసారి, ఓ ఆర్గనైజర్ నాతో తప్పుగా ప్రవర్తిస్తే వార్నింగ్ ఇచ్చా: యాంకర్ లాస్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓసారి, ఓ ఆర్గనైజర్ నాతో తప్పుగా ప్రవర్తిస్తే వార్నింగ్ ఇచ్చా: యాంకర్ లాస్య

  • మొదట్లో ఈవెంట్లలో పాల్గొనే దానిని
  • ఓ ఆర్గనైజర్ నాతో తప్పుగా ప్రవర్తించాడు
  • దీంతో, ఏ ఈవెంట్ దరిదాపుల్లోకి నేను వెళ్లడం లేదు
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం బయటకు వచ్చినట్టుగానే అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు కూడా బయటకు వస్తే బాగుంటుందని యాంకర్ లాస్య అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యాంకర్ గా చాలా బిజీగా ఉన్న సమయంలోనే తాను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లానని చెప్పింది. యాంకర్ గా పనిచేశానని చెబితే తానేదో తప్పు చేశానని భావిస్తూ, నవ్వుతున్నారని, అందుకే, తాను యాంకర్ గా ఇండియాలో పని చేశానని చెప్పొద్దని ఇక్కడి వారిని వేడుకుంటున్నానని తన ఆవేదన వ్యక్తం చేసింది.

టాలీవుడ్ లో ‘కమిట్ మెంట్’ అడిగినట్టుగా.. అమెరికాలో ‘షాపింగ్’కి ఒప్పుకొంటారా? అని అడుగుతారని లాస్య చెప్పింది. షాపింగ్ కి ‘ఓకే’ అంటే అన్నింటికి అంగీకరించినట్టేనని పేర్కొంది. మొదట్లో ఈవెంట్లలో తాను పాల్గొనే దానినని, కానీ, ఇక్కడి ఆర్గనైజర్లు తప్పుగా ప్రవర్తించేవారని ఆరోపించారు. ఓసారి, ఓ ఆర్గనైజర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తే వార్నింగ్ ఇచ్చానని చెప్పింది. పద్ధతిగా సంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్లను కూడా ఈ విధంగా అడుగుతున్నారని, దీంతో, ఏ ఈవెంట్ దరిదాపుల్లోకి తాను వెళ్లడం లేదని, దానికి కారణం ఇలాంటి చెత్త వెధవలేనంటూ లాస్య మండిపడింది.
Tollywood
anchor lasya

More Telugu News