'ఎన్టీఆర్' బయోపిక్ రెగ్యులర్ షూటింగుకు ముహూర్తం ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎన్టీఆర్' బయోపిక్ రెగ్యులర్ షూటింగుకు ముహూర్తం ఖరారు

  • బాలకృష్ణతో 'ఎన్టీఆర్' బయోపిక్
  • ఫస్టు షెడ్యూ ల్ కి సన్నాహాలు 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
'ఎన్టీఆర్' బయోపిక్ ను లాంచ్ చేసి కొన్ని రోజులవుతోంది .. ఇప్పటికే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లాల్సి వుంది. అయితే దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వలన ఆలస్యమైంది. బాలకృష్ణ ఈ ప్రాజెక్టును తీసుకెళ్లి దర్శకుడు క్రిష్ చేతిలో పెట్టారు. ఆయన ఈ సినిమా స్క్రీన్ ప్లే ను మార్చుకుని, రెగ్యులర్ షూటింగుకు సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చేనెల 5వ తేదీ నుంచి ఫస్టు షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఫస్టు షెడ్యూల్ కి సంబంధించిన నటీనటులను ఆయన ఇప్పటికే ఎంపిక చేశారు. త్వరలోనే మిగతా పాత్రలకు సంబంధించిన నటీ నటుల ఎంపిక ప్రక్రియను కూడా ఆయన పూర్తిచేయనున్నారట. ఫస్టు షెడ్యూల్ కి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోను .. రామకృష్ణ సినీ స్టూడియోలోను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే.     
balakrishna

More Telugu News