రజనీ సరసన ఛాన్స్ కోసం కాజల్ వెయిటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ సరసన ఛాన్స్ కోసం కాజల్ వెయిటింగ్

  • కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ
  • కథానాయిక కోసం అన్వేషణ  
  • కాజల్ పేరు దగ్గర ఆగిన పరిశీలన  
తెలుగులోనే కాదు .. తమిళంలోను కాజల్ అగ్రకథానాయిక అనిపించుకుంది. తమిళంలో అజిత్ .. విజయ్ .. విశాల్ .. ధనుష్ .. జీవా వంటి స్టార్ హీరోలతో ఆమె జోడీ కట్టింది. తమిళంలోను ఎన్నో సక్సెస్ లు ఆమె ఖాతాలో వున్నాయి. అలాంటి కాజల్ కి రజనీకాంత్ మూవీలో అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రజనీకాంత్ .. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక కోసం చాలామంది పేర్లను పరిశీలించారు. ఆ జాబితాలో కాజల్ పేరు కూడా వుంది. ఈ సినిమా టీమ్ లోని సభ్యులలో ఎక్కువ మంది కాజల్ వైపే మొగ్గుచూపుతున్నారట. అందువలన కథానాయికగా ఆమెనే తీసుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక కాజల్ వరకూ ఈ వార్త వెళ్లడంతో .. ఈ సినిమా యూనిట్ అడిగిందే ఆలస్యం డేట్స్ ఇవ్వడానికి సిద్ధమైపోతోందట. 
rajani
kajal

More Telugu News