ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని... బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి కుమారుడి ఆత్మహత్య!
- ప్రేమ వివాహానికి అంగీకరించని తల్లిదండ్రులు
- ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న నాగార్జునరెడ్డి
- కేసు నమోదు చేశామన్న పోలీసులు
గత రాత్రి తన తండ్రితో కలసి బెంగళూరు నుంచి బనగానపల్లికి వచ్చిన నాగార్జున రెడ్డి, తండ్రితో తన పెళ్లి విషయమై వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. బనగానపల్లిలో నాగార్జున రెడ్డి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతుండగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపాయి. నాగార్జునరెడ్డి ఆత్మహత్యపై మరింత సమాచారం తెలియాల్సివుంది.