Karimnagar District: ప్రేమించడం లేదని... కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దారుణం!
- ఉన్మాదిలా మారిన యువకుడు
- యువతి గొంతు కోసి, ఆపై ఆత్మహత్యాయత్నం
- ప్రాణాలు కోల్పోయిన యువతి
తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఉన్మాదిలా మారిన ఓ యువకుడు పట్టపగలు దారుణానికి ఒడిగట్టాడు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కొద్దిసేపటి క్రితం రసజ్ఞ అనే యువతి గొంతుకోసిన వంశీధర్ అనే యువకుడు, ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాధమిక సమాచారం మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలోనే ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ పనిచేస్తుండగా, గత కొంతకాలంగా వంశీధర్ ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో ఉదయం మీసేవ కేంద్రానికి రసజ్ఞ రాగా, బయట ఆమెతో వాదనకు దిగి, ముందుగానే తెచ్చి పెట్టుకున్న పదునైన ఆయుధంతో ఆమె మెడ నరికాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టూ ఉన్న స్థానికులు రసజ్ఞను ఆసుపత్రికి తరలిస్తుంటేనే ప్రాణాలు కోల్పోయింది. చేతికి గాయంతో రక్తపు మడుగులో పడివున్న వంశీధర్ ను పోలీసులకు అప్పగించగా, వారు నిందితుడిని ఆసుపత్రికి తరలించారు.