చంద్రుడిపై ధూళిని చిన్నారికి కానుకగా ఇచ్చిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.. అది తమదే అంటున్న నాసా!
- లారా అనే అనే మహిళకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కానుక
- అప్పుడు ఆమె వయసు 10 ఏళ్లు
- మూన్ డస్ట్ ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న నాసా
ఈ నేపథ్యంలో, 1970లలో చంద్రుడి ధూళితో కూడిన ఒక చిన్న సీసాను, చేతి రాతతో ఉన్న ఒక నోట్ ను కూడా చిన్నారి లారాకు ఆర్మ్ స్ట్రాంగ్ కానుకగా ఇచ్చారు. అప్పుడు లారా వయసు 10 ఏళ్లు. ఇప్పుడు ఆ చంద్రుడి ధూళిని నాసా తీసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆమె తరపు లాయర్ తెలిపారు. అంతరిక్షానికి సంబంధించిన వస్తువులను ప్రైవేట్ వ్యక్తుల నుంచి నాసా తీసుకుంటోందని చెప్పారు. చట్ట ప్రకారం చంద్రుడికి సంబంధించిన ధూళిని లారా నుంచి తీసుకునే హక్కు నాసాకు లేదని తెలిపారు. మూన్ డస్ట్ కు సంబంధించి లారానే యజమానురాలని చెప్పారు.