టాలీవుడ్ హీరోయిన్స్ తో సెక్స్ రాకెట్... అమెరికాలో మోదుగుమూడి కిషన్, భార్య చంద్ర అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ హీరోయిన్స్ తో సెక్స్ రాకెట్... అమెరికాలో మోదుగుమూడి కిషన్, భార్య చంద్ర అరెస్ట్!

  • సినిమా షూటింగ్ ల పేరిట అమెరికాకు ఆహ్వానం
  • ఖరీదైన హోటళ్లలో ఉంచి వ్యభిచారం
  • సంచలనం కలిగిస్తున్న సెక్స్ స్కాండల్
టాలీవుడ్ హీరోయిన్స్ ను సినిమా షూటింగులంటూ తాత్కాలిక వీసాపై అమెరికాకు రప్పించి, వారిని ఖరీదైన హోటళ్లలో ఉంచి, విటులను పంపుతున్న సెక్స్ స్కాంను అమెరికా పోలీసులు బట్టబయలు చేశారు. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న ఈ సెక్స్ స్కాండల్ చికాగో కేంద్రంగా నడుస్తోంది. ఎన్నారై మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రలు దీనికి సూత్రధారులుగా యూఎస్ పోలీసులు పేర్కొన్నారు.

గత కొంత కాలంగా ఈ రాకెట్ నడుస్తోందని, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు విచారణ సాగుతోందని తెలిపాయి.
S*x Scandal
Tollywood
Chicago
Kishan
Chandra

More Telugu News