నానిపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు: హీరో విశాల్

  • చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంటా
  • కానీ, ప్రముఖలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు కరెక్టు కాదు
  • మహిళల పట్ల నాని మర్యాదగా ప్రవర్తిస్తారు
  • భవిష్యత్ లో నన్ను కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుందేమో!
టాలీవుడ్ హీరో నానిపై నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు పంపించాడు. దీనికి ప్రతిస్పందనగా తాను కూడా చట్టపరంగానే పోరాటం చేస్తానంటూ శ్రీరెడ్డి పేర్కొనడం విదితమే. ఈ వ్యవహారంపై దక్షిణాది నటుడు విశాల్ స్పందించాడు.

 ‘చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంటాను. కానీ, ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం కరెక్టు కాదు. నాకు నాని గురించి తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు, వ్యక్తిగత కారణాల రీత్యా నానికి మద్దతు తెలపడం లేదు. నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదమైనవి. మహిళల పట్ల నాని ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో అతని గురించి తెలిసిన వారందరికీ ఈ విషయం తెలుసు.

 శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే ఆధారాలు చూపించాలి. కేవలం, వారి పేర్లు బయటపెడితే సరిపోదు. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఇతరులపై తన ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. భవిష్యత్ లో నన్ను కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుందేమో! ఆడిషన్ పేరిట వారిని మోసం చేయడం తప్పు. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించి సరైన చట్లాల్లేవు. ఏ మహిళ అయినా ఇతరులపై ఆరోపణలు చేస్తే దానిని మాత్రమే చట్టం పరిగణనలోకి తీసుకుంటోంది. ఆరోపణలు చేసే వారికే మద్దతుగా నిలుస్తోంది. ఇది సబబు కాదు’ అని విశాల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
sri reddy
vishal

More Telugu News