Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రియల్ మీ1 సిల్వర్ ఎడిషన్ వచ్చేస్తోంది... 18న అమ్మకాలు

  • 4జీబీ ర్యామ్, 64జీబీ వెర్షన్ లోనే ఈ కలర్ లభ్యం
  • అమేజాన్ డాట్ ఇన్ లో విక్రయానికి
  • 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
చైనాకు చెందిన ఒప్పో ఆన్ లైన్ లో మాత్రమే విక్రయం కోసం తీసుకొచ్చిన బ్రాండ్ ‘రియల్ మీ1’లో 4జీబీ ర్యామ్ వెర్షన్ మొదటి సారిగా ఈ నెల 18న అమ్మకానికి వస్తోంది. ఇప్పటికే 3జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ వెర్షన్ మోడళ్లు అమ్మకాలు జరుగుతుండగా, 4జీబీ ర్యామ్ మోడల్ రావడంలో ఆలస్యం జరిగింది. ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే, సిల్వర్ కలర్ లో ఉండడం. మిగిలిన రెండు వెర్షన్లలో సిల్వర్ కలర్ అందుబాటులో లేదు. కేవలం డైమండ్ బ్లాక్, సోలార్ రెడ్ కలర్స్ లోనే వచ్చాయి.

జూన్ 18న అమేజాన్ లో అమ్మకానికి రానుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో ఉన్న సిల్వర్ మూన్ కలర్ ఫోన్ ధర రూ.10,990. ఫీచర్లు మిగిలిన వెర్షన్లలో మాదిరే ఉంటాయి. 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 84.75 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, మీడియా టెక్ హీలియో పి60 ప్రాసెసర్, వెనుక 13 మెగాపిక్సల్ కెమెరా, ముందు 8 మెగాపిక్సల్ కెమెరా, 3,410 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
realme1
smart phone

More Telugu News