షకీలా 'శీలవతి'కి కష్టం... సినిమా చూడకుండానే 'నో' చెప్పిన సెన్సార్!

  • షకీలా 250వ చిత్రంగా 'శీలవతి'
  • పేరు మార్చాలని సూచించిన సెన్సార్ బోర్డు
  • చూడకుండా ఎలా చెబుతారంటున్న షకీలా
అడల్ట్ మూవీస్ లో ఓ వెలుగు వెలిగిన షకీలా, తన 250వ చిత్రంగా 'శీలవతి' అన్న చిత్రాన్ని నిర్మించగా, అది విడుదలకు ముందే కష్టాల్లో పడింది. ఈ సినిమా టైటిల్ మార్చాలని, అప్పుడే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు స్పష్టం చేయడంతో, అసలు సినిమా కూడా చూడకుండా అభ్యంతరాలు ఎలా చెబుతారని షకీలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సినిమా టైటిల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేది లేదని కరాఖండీగా చెప్పిన ఆమె, సినిమా చూసి అభిప్రాయం చెప్పాలని కోరింది. ఇప్పుడు టైటిల్ మార్చడం కుదరదని చెప్పింది. ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేయాలని భావించానని చెప్పింది.

"షకీలా సినిమాకు 'శీలవతి' అన్న పేరు ఉండవద్దని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారట. అది ఎందుకో నాకు తెలియలేదు. నా పాత డబ్బింగ్ సినిమాకు కూడా 'శీలవతి' అనే పేరుంది. నా ఫిల్మ్ చూడకుండానే ఈ టైటిల్ సూట్ కాలేదని ఎలా చెబుతారు? నాకు రీజన్ తెలియాలి. మొత్తం పబ్లిసిటీ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత ఇదేంటి? ఆ టైటిల్ మార్చలేము. ఫిల్మ్ ఓసారి చూసి రీజన్ చెప్పండి" అని షకీలా కోరింది.
Go Back to Shorts
Shakeela
Seelavathi
250th Movie
Sensor board

More Telugu News