సోదరిని వేధిస్తున్నాడని కేసు పెట్టిన యువకుడిని బస్సులో కొట్టి చంపిన కిరాతకుడు!
- యువకుడి సోదరికి వేధింపులు
- కేసు పెట్టిన బాధితురాలి తల్లిదండ్రులు
- ఆగ్రహంతో కొట్టి చంపిన నిందితుడు
ఈ క్రమంలో నిందితుడు అప్పటికే కూర్చుని ఉన్న బస్సునే బాధితుడు కూడా ఎక్కాడు. ఆపై వారి మధ్య వాగ్వాదం జరుగగా, ఆగ్రహానికి లోనైన నిందితుడు బాధితుడిపై దాడికి దిగాడు. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా పొడిచాడు. చుట్టూ ఉన్నవారు భయంతో కేకలు పెడుతూ ఉంటే, నింపాదిగా దిగిపోయాడు. ఈ ఘటన మంగళవారం నాడు ఖేద్ తెహసిల్ సమీపంలోని దవాడి గ్రామంలో జరిగింది. బాధితుడి సోదరి ఫొటోలను, వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నాడని, నిందితుడు బాధిత కుటుంబానికి బంధువేనని పోలీసులు వెల్లడించారు. హత్య చేసి పారిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.