బస్టాండ్‌లో బస్సులోనే యువతిపై కండక్టర్ అత్యాచార యత్నం!

  • ఒంటరిగా బస్సు ఎక్కిన మహిళపై కండక్టర్ అసభ్య ప్రవర్తన
  • గమ్య స్థానానికి చేరుకోకముందే బస్సు నుంచి తోసేసిన వైనం
  • బాధిత మహిళ ఫిర్యాదుతో కండెక్టర్ అరెస్ట్
ఒంటరిగా బస్సెక్కిన మహిళపై కన్నేసిన ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ బస్సులోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. యువతి పెద్దగా అరవడంతో బస్టాండ్‌లో ఉన్న ఇతర ప్రయాణికులు బస్సులోకి వచ్చారు. పరారీలో ఉన్న కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.. భువనేశ్వర్‌లోని బర్ముండా ప్రాంతంలో జరిగిందీ ఘటన.  

భువనేశ్వర్‌లో నివసిస్తున్న కేంఝర్ డింబో గ్రామానికి చెందిన యువతి సొంతూరుకు వెళ్లేందుకు బర్ముండా బస్టాండ్‌కు చేరుకుంది. గ్రామానికి వెళ్లే ప్రైవేటు బస్సు సిద్ధంగా ఉండడంతో అందులో ఎక్కి కూర్చుంది. బస్సు ఖాళీగా ఉండడం, ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కండక్టర్ దానిని ఆసరాగా చేసుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆమె అరవడంతో బస్టాండ్‌లోనే ఉన్న కొందరు వెంటనే బస్సెక్కారు. దీంతో కండక్టర్ పరారయ్యాడు.

కాసేపటికి బస్సు బయలుదేరిన తర్వాత బస్సులోకి వచ్చిన కండక్టర్ రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సు కేంఝర్‌కు చేరుకోకముందే బాధిత మహిళను మార్గమధ్యంలో బలవంతంగా దించేశాడు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో వారొచ్చి ఆమెను తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కండక్టర్‌ను అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Bus stand
Odisha
molest
conductor

More Telugu News