6 నెలల్లో 75 కార్యక్రమాలు.. చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ
- యూనివర్శిటీల్లో అన్ని జిల్లాల విద్యార్థులతో భేటీ
- నాయకులపై ప్రతి 45 రోజులకు ఒకసారి అభిప్రాయ సేకరణ
- ఎంపీలు క్షేత్ర స్థాయిలో కూడా పోరాడాలి
విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకపోవడంపై టీడీపీ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పోరాడాలని చంద్రబాబు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒక కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించాలని చెప్పారు. విశాఖ రైల్వే జోన్, పెట్రో కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై పోరాడాలని తెలిపారు. ఢిల్లీలో ఆందోళనలు కూడా చేపట్టాలని సూచించారు.