హీరో అంటే ఎంతో క్రేజ్ ఉండాలి .. ఆయన మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడాలి: కమెడియన్ శ్రీనివాస రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో అంటే ఎంతో క్రేజ్ ఉండాలి .. ఆయన మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడాలి: కమెడియన్ శ్రీనివాస రెడ్డి

  • హీరో అనే మాటకి నేను సూటబుల్ కాదు 
  • పోస్టర్ తోనే జనం దృష్టిని ఆకర్షించాలి  
  • రిలీజ్ రోజునే జనం క్యూలో నుంచోవాలి     
తెలుగు ప్రేక్షకులను నవ్వించే హాస్య బృందంలో శ్రీనివాస రెడ్డి ఒకరుగా కనిపిస్తారు. ఒక వైపున కమెడియన్ గా చేస్తూనే .. మరో వైపున కథను నడిపించే ప్రధానమైన పాత్రలను సైతం చేస్తూ వెళుతున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఓపెన్ గా చెప్పాలంటే హీరో అనే పదానికి నేను సూటబుల్ కాదు. హీరో అంటే ఒక రేంజ్ ఉండాలి .. ఆయన పోస్టర్ పడిందంటే ఆడియన్స్ క్యూలో నుంచోవాలి.

ఏ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా దానికో క్రేజ్ ఉంటుంది .. ఆ హీరోకి ఒక కేపబులిటీ వుంటుంది. ఆ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. కానీ శ్రీనివాస రెడ్డి సినిమా ఎప్పుడొస్తుందా అని ఎవరూ ఆలోచించరు. అందువలన కమెడియన్ గా కనిపిస్తూ .. బాగా చేశాడ్రా అనిపించుకుంటూ .. హీరోగా అవకాశాలు వస్తే చేసుకుంటూ ఆడియన్స్ కి టచ్ లో ఉంటున్నాను. అంతేగానీ హీరోగా ముందుకెళ్లాలా .. కమెడియన్ గానే కొనసాగాలా అనే విషయంలో క్లారిటీ లేక కాదు" అని చెప్పుకొచ్చారు.     
srinivas reddy

More Telugu News