‘సైరా’ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
- చిరంజీవి కథానాయకుడిగా 'సైరా'
- కొనసాగుతోన్న యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- వచ్చే వేసవిలో విడుదల
అందువలన ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం .. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ 'గ్రెగ్ పావెల్'ను రంగంలోకి దింపారు. 'స్కై ఫాల్' .. 'హ్యారీ పోటర్' వంటి సినిమాలకు యాక్షన్ డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. ఆయన కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో వుండనున్నాయని నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా నయనతార కనిపించనుండగా, అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.