ఈ నెల 22న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 22న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • మోదీకి వ్యతిరేకంగా భావసారూప్యత లేని పార్టీలు ఏకమయ్యాయి
  • దళితులు, గిరిజనులను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ వాడుకుంది
  • రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే కాంగ్రెస్ ప్రశ్నించ లేదే?
ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించనున్నారని టీ-బీజేపీ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీకి వ్యతిరేకంగా భావసారూప్యత లేని పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు.

ఈ సందర్భంగా వరంగల్ లో నిన్న జరిగిన దళిత సింహ గర్జన సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పాల్గొనడంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించ లేదని మండిపడ్డారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకుగానే వాడుకుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత పటిష్టం చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ ప్రస్తావించారు. 
t-bjp
laxman
amit shah

More Telugu News