కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్

  • దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు
  • రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు
  • సంపత్ ను శాసనసభ నుంచి బహిష్కరించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను ఆ పదవి నుంచి తొలగించారని అన్నారు.

దళిత ఎమ్మెల్యే సంపత్ ను శాసనసభ నుంచి బహిష్కరించారని విమర్శించారు. తెలంగాణలో దళితులకు పాలించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వేచ్ఛను హరించే యత్నం జరుగుతోందని... ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. 
kcr
meera kumar
dalit

More Telugu News