అవసరమైతే బీఎస్పీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు రెడీ!: అఖిలేశ్
- బీజేపీని ఓడించడమే మా లక్ష్యం
- ఇందుకోసం రాజీకైనా సిద్ధమే
- యోగి పాలనలో అన్ని చోట్లా బీజేపీ ఓడిపోతుంది
‘‘మా ఉద్దేశ్యం బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో గెలవడమే. బీఎస్పీతో పొత్తుకు రెడీ’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య భాగస్వామ్యం ఇటీవలి ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోతుందన్న అఖిలేశ్, గత నాలుగు ఉప ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థుల విజయాన్ని ఉదహరించారు.