షారుఖ్‌ ఖాన్‌ కూతురి పోజులు.. ఫొటోలు వైరల్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షారుఖ్‌ ఖాన్‌ కూతురి పోజులు.. ఫొటోలు వైరల్‌

  • తల్లితో కలిసి లండన్‌లో ఫొటోలు
  • చదువు పూర్తి చేసుకున్న సుహానా ఖాన్‌
  • త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ?
బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె లండన్‌లో చదువు పూర్తి చేసుకుంటోన్న నేపథ్యంలో అక్కడ పర్యాటక ప్రదేశాలని తన తల్లి గౌరీ ఖాన్‌తో కలిసి మరోసారి చూస్తోంది. గౌరీ ఖాన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. సిల్వర్‌ కలర్‌ దుస్తుల్లో అదిరిపోయే పోజులిస్తోన్న సుహానా ఫోటోలు అలరిస్తున్నాయి. ఆమె త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మంచి క్రేజ్‌ ఉంది. చదువు పూర్తి కావడంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.     
Twitter
Shahrukh Khan
Bollywood

More Telugu News