2019 ఎన్నికల్లో ఏపీలో ఏ సీటు గెలవగలరో కన్నా చెప్పగలరా?: మంత్రి కళా వెంకట్రావు

  • విమర్శలు చేస్తేనే రాజకీయాలని కన్నా భావిస్తున్నారు
  • ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ ధర్నాలు చేపడుతోంది?
  • పసలేని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఏం సాధిస్తారు?
టీడీపీపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తేనే రాజకీయాలని కన్నా భావిస్తున్నారని, ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిపోయి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం ధర్నాలు, ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలను బీజేపీ చేపడుతోందని ప్రశ్నించారు.

 పసలేని ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్న తమపైనే కన్నా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ సీటు గెలవగలరో కన్నా చెప్పగలరా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి రేటు 10.5 శాతం ఉంటే దేశంలో బీజేపీ సాధించింది 7.5 శాతం మాత్రమేనని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు.
Go Back to Shorts
kanna laxmi narayana
kala venkat rao

More Telugu News