షాహిద్‌ అఫ్రిది ఇంట్లో సింహం పిల్ల?.. నెటిజన్ల ఆగ్రహం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షాహిద్‌ అఫ్రిది ఇంట్లో సింహం పిల్ల?.. నెటిజన్ల ఆగ్రహం!

  • తన కూతురి ఫొటో పోస్ట్ చేసిన అఫ్రిది
  • ఆమె వెనకాల సింహం పిల్ల 
  • ఇంట్లో సింహాన్ని బంధించాడంటోన్న నెటిజన్లు
తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన తన కూతురి ఫొటోను పోస్ట్ చేస్తూ ప్రేమించిన వాళ్లతో సమయం గడపడంతో ఎంతో సంతోషమని, తన చిట్టితల్లి తాను వికెట్ తీసినప్పుడు ఇచ్చే పోజ్‌ని అనుకరించిందని అన్నాడు. కాగా, జంతువులను రక్షించడం మర్చిపోకండని, వాటికి మన ప్రేమ ఎంతో అవసరమని పేర్కొన్నాడు.

అయితే, ఆ ఫొటోల్లో అఫ్రిది ఓ జింకకు పాలు తాగిస్తున్నట్లు ఉండగా, మరో ఫొటోలో ఆయన కూతురి వెనుక ఓ సింహం పిల్ల ఉంది. ఇంట్లో సింహాన్ని పెంచుకోవడమేంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, అది నిజమైన సింహమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సింహాన్ని ఇంట్లో బంధించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా క్రూర జంతువులను బంధించడం చట్ట విరుద్ధమని అంటున్నారు. మొత్తానికి ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.
shahid
Pakistan
Cricket

More Telugu News