సల్మాన్ ఖాన్ హత్యకు హర్యానా గ్యాంగ్ స్టర్ కుట్ర.. పోలీసుల విచారణలో వెల్లడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సల్మాన్ ఖాన్ హత్యకు హర్యానా గ్యాంగ్ స్టర్ కుట్ర.. పోలీసుల విచారణలో వెల్లడి

  • హర్యానా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు సంపత్
  • ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించాడు
  • హతమార్చిన అనంతరం దేశం విడిచి పారిపోవాలనుకున్నాడు 
హర్యానా రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రాను హైదరాబాద్ లో పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలోని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు సంపత్. ఇతను కూడా బిష్ణోయ్ వర్గానికి చెందినవాడే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నుతున్నట్టు చెప్పాడు. ఇందుకోసం ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్టు, సల్మాన్ ఇంటిని, అతను వెళ్లే మార్గాలను తన ఫోన్ లో ఫొటోలు తీసుకున్నట్టు ఈ విచారణలో బయటపడింది. సల్మాన్ ని హతమార్చిన అనంతరం దేశం విడిచి పారిపోయేందుకు కూడా సంపత్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

కాగా, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ సంపత్. పలు హత్యలు, దోపిడీలతో సంబంధం ఉంది. అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. కొన్ని రోజులుగా మియాపూర్ లో తలదాచుకుంటున్న సంపత్ ను సైబరాబాద్, హర్యానా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
Salman Khan
haryana gangster

More Telugu News