సీఎం యోగి ఇచ్చిన చెక్కు బౌన్స్.. పెనాల్టీ కట్టిన విద్యార్థి!
- పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థి
- సీఎం యోగి చేతుల మీదుగా ప్రోత్సాహకం
- బౌన్స్ అయిన లక్ష రూపాయల చెక్
అయితే, ఆ లక్ష రూపాయలు అతడి ఖాతాలో పడకపోగా పైపెచ్చు జరిమానా కూడా పడింది. ఈ విషయం మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన అలోక్‌కు అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. చెక్ బౌన్స్ కావడంతో పెనాల్టీ విధించినట్టు చెప్పారు. చెక్ బౌన్స్ విషయమై అధికారులు మాట్లాడుతూ.. బారాబంకి జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ సంతకంలో తేడా వల్ల చెక్ బౌన్స్ అయినట్టు చెప్పారు. అలోక్‌కు కొత్త చెక్ జారీ చేసినట్టు తెలిపారు.