Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రణతి నా దేవత'.. విడాకులు తీసుకోవట్లేదని స్పష్టం చేసిన మంచు మనోజ్‌!

  • ట్విట్టర్‌లో అభిమానులతో మంచు వారబ్బాయి చాటింగ్‌
  • విడాకుల వార్తలపై స్పందించాలని అడిగిన అభిమాని 
  • 'వాళ్ల బొంద' అని సమాధానం
సినీనటుడు మంచు మనోజ్‌కి, భార్య ప్రణతికి మధ్య విభేదాలు వచ్చాయని, వారు విడాకులు తీసుకుంటున్నారని, గాసిప్స్‌ వస్తున్నాయి. ఈ విషయంపై మంచు మనోజ్‌ స్పష్టత ఇచ్చాడు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో తన అభిమానులతో చాట్‌ చేశాడు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు.

'మీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి? మీ భార్య ప్రణతి గురించి మీ అభిప్రాయమేంటీ?' అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మంచు వారబ్బాయి.. 'వాళ్ల బొంద. ప్రణతి నా దేవత' అని ఒక్క ముక్కలో సమాధానం చెప్పి రూమర్లన్నింటికీ చెక్ పెట్టాడు.

కాగా, ఓ అభిమాని ట్వీట్‌ చేస్తూ... తనకు ఒక రిప్లై ఇవ్వాలని, రిప్లై కోసం చూసీ చూసీ కోపంతో ఫోన్‌ పగలగొట్టేలా ఉన్నానని పేర్కొన్నాడు. దానికి మనోజ్‌ సమాధానం ఇస్తూ 'నో కోపం.. లవ్యూ' అని పేర్కొన్నాడు. కులం పేరుతో కొందరు రాజకీయ నేతలు మన దేశాన్ని విభజించాలని చూస్తున్నారని, దీనిపై మీ అభిప్రాయమేంటి? అని ఓ నెటిజన్ అడగగా 'మన కర్మ... బ్రిటిషర్లు మనకు డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీని బాగా నేర్పించి వెళ్లారు' అని పేర్కొన్నాడు.
manoj
manchu

More Telugu News