భారత్‌లో కశ్మీర్‌ ఉన్నట్లు స్కూలు పుస్తకాల్లో ముద్రణ.. నిషేధించిన పాకిస్థాన్

  • ఆ పుస్తకాల్లో మరిన్ని అభ్యంతరకర అంశాలు 
  • పాక్‌లోని పంజాబ్ పరిసర ప్రాంతాల్లో పుస్తకాలు 
  • ఆయా విద్యాసంస్థల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు
తమ దేశంలో 2, 4, 5, 7, 8 తరగతుల సాంఘిక శాస్త్ర పుస్తకాల్లో మ్యాప్‌లో కశ్మీర్ భూభాగం భారత్‌లో అంతర్భాగమని ఉండడంతో పాకిస్థాన్‌ వాటిని నిషేధించింది. అంతేగాక, ఆ పుస్తకాల్లో మరిన్ని అభ్యంతరకర అంశాలు ఉన్నాయని పేర్కొంది.

పాక్‌లోని పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాల్లో ఈ పుస్తకాలు ఉన్నట్లు తెలిపింది. పంజాబ్‌లో వెంటనే ఆ పుస్తకాల‌ను నిషేధించాలని పీసీటీబీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూమ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఆయా విద్యాసంస్థల నిర్వాహకులు, పుస్తకాల పబ్లిషర్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.   
Go Back to Shorts
India
Pakistan
social studies

More Telugu News