కోర్టుకు హాజరైన జగన్, విజయసాయి, గాలి జనార్దన్ రెడ్డి
- అక్రమాస్తుల కేసులో జగన్ హాజరు
- పాదయాత్రకు ఒక రోజు బ్రేక్
- అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి హాజరు
అక్రమాస్తుల కేసులో హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాలపై విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం కోర్టుకు జగన్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కేసు విచారణ కోసం పాదయాత్రకు ఆయన ఒక్కరోజు విరామం ప్రకటించారు.
మరోపక్క, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.