అఖిల్ తో సినిమా వర్మ చేజారినట్టే!
- అఖిల్ తో మూవీ ఉంటుందన్న వర్మ
- 'ఆఫీసర్' ప్లాప్ తో ఆలోచనలో పడిన ఫ్యాన్స్
- వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించడం లేదన్న అఖిల్
ఈ క్రమంలో 'ఆఫీసర్' సినిమా విడుదల కావడం .. ప్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగిపోయాయి. దాంతో వర్మతో అఖిల్ మూవీ ఉంటుందా .. లేదా అనే సందేహంలో అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ మాట్లాడుతూ .. "వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాను .. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సినిమాపైనే వుంది. వేరే ఏ ప్రాజెక్టును గురించి నేను ఆలోచించడం లేదు .. అభిమానులకు నచ్చే సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే నా ముందున్న లక్ష్యం" అంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్ ధోరణి చూస్తుంటే ఆయన వర్మ సినిమా చేయడం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడనిపించడం లేదూ!