వేరొకరి బైక్‌పై భార్య.. లారీతో ఢీకొట్టి చంపిన భర్త!

  • మరిది వరసైన వ్యక్తి బైక్‌పై భార్య
  • అక్రమ సంబంధం ఉందని అనుమానం
  • విజయనగరం జిల్లాలో ఘటన
వేరొకరి బైక్‌పై తన భార్య కనిపించడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త.. తాను డ్రైవ్ చేస్తున్న లారీతోనే ఆమెను ఢీకొట్టి చంపేశాడు. విజయనగరం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రమణమ్మ-తవిటయ్య భార్యాభర్తలు. తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా నిత్యం లారీపైనే ఉండే తవిటయ్యకు భార్యపై అనుమానం వుండేది. ఈ క్రమంలో నిన్న భార్యకు ఫోన్ చేసి సుభద్రాపురం జంక్షన్‌కు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు.

భర్తను కలిసేందుకు రమణమ్మ, మరిది వరసైన రామకృష్ణతో కలసి బైక్‌పై సుభద్రాపురం బయలుదేరింది. వారిద్దరినీ చూసిన తవిటయ్యలో అనుమానం మరింతగా పెరిగింది.. అతనిలో ఆగ్రహం ముంచుకొచ్చింది. అంతే, లారీతో వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ  ఘటనలో రమణమ్మ అక్కడికక్కడే చనిపోగా రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Vizianagaram
Lorry
Accident

More Telugu News