Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మూడు సినిమాలతో బిజీ బిజీగా సమంత
  • మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట! 
  • తెలుగులో నివేదా థామస్ మరో చిత్రం  
*  ఈ ఏడాది ఇప్పటికే 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు' వంటి హిట్లతో మంచి ఊపు మీదున్న కథానాయిక సమంత, ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా వుంది. సీమరాజా, యూ టర్న్ (రీమేక్), సూపర్ డీలక్స్ చిత్రాలతో ఆమె బిజీగా వుంది. 'ఈ ఏడాది ఫస్టాఫ్ అద్భుతంగా గడచిపోయింది. సెకండాఫ్ కి రెడీ అవుతున్నాను' అంటూ ఈ చిన్నది తాజాగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలకు డబ్బింగ్ మొదలెట్టింది.
*  ప్రస్తుతం వంశీ పైడిపల్లితో ఓ చిత్రాన్ని చేస్తున్న మహేశ్ బాబు, దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పనిచేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టును సుకుమార్ సిద్ధం చేసి, మహేశ్ కి వినిపించాడని, మహేష్ సంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది.
* అందాలబొమ్మ నివేదా థామస్ త్వరలో శ్రీవిష్ణుతో జతకట్టనుంది. 'మెంటల్ మదిలో' ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శ్రీవిష్ణు, నివేద జంటగా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Samantha
Mahesh Babu
Niveda Thomas

More Telugu News