నేను, మా నాన్న ధోనీ అభిమానులం: సల్మాన్‌ ఖాన్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను, మా నాన్న ధోనీ అభిమానులం: సల్మాన్‌ ఖాన్‌

  • ధోనీ ఎల్లప్పుడూ కూల్‌గా ఉంటాడు
  • పాజిటివ్ ఎనర్జీతో కనిపిస్తాడు
  • సెంచరీ సాధించినప్పుడు ఎలాంటి సంబరాలు చేసుకోడు
  • మైదానంలోనూ చాలా మర్యాదగా ఉంటాడు
టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో తనకు మహేంద్ర సింగ్‌ ధోనీ అంటే చాలా ఇష్టమని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ అన్నాడు. తాజాగా ఆయన ‘దస్‌ కా దమ్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ... ధోనీ అంటే తన నాన్నకు కూడా చాలా ఇష్టమని చెప్పాడు. భారత క్రికెట్‌ జట్టుకు ధోనీ బెస్ట్‌ కెప్టెన్‌ అవుతాడని తన నాన్న అప్పట్లో అంటుండేవారని తెలిపాడు.

ధోనీ ఎల్లప్పుడూ కూల్‌గా ఉంటాడని, పాజిటివ్ ఎనర్జీతో కనిపిస్తాడని సల్మాన్‌ ఖాన్‌ ప్రశంసించాడు. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా గెలిచినప్పుడు, తాను సెంచరీ సాధించినప్పుడు ధోనీ ఎలాంటి సంబరాలు చేసుకోడని, ఆ సమయంలోనూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాడని చెప్పాడు. మైదానంలోనూ ఆయన చాలా మర్యాదగా ఉంటాడని, అందుకే తాను, తన నాన్న ధోనీకి ఫ్యాన్స్ అయిపోయామని తెలిపాడు.
MS Dhoni
Cricket
Salman Khan

More Telugu News