రవితేజతో జోడీకడుతున్నట్టు చెప్పిన కాజల్
- తమిళంలో హిట్ కొట్టిన 'తెరి'
- రవితేజ హీరోగా తెలుగులోకి రీమేక్
- ఒక కథానాయికగా కేథరిన్
ఈ ప్రాజెక్టును గురించి కాజల్ చెబుతూ .. "విజయ్ హీరోగా తమిళంలో హిట్ కొట్టిన 'తెరి' చిత్రాన్ని.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా నేను నటిస్తున్నాను .. రీసెంట్ గా ఈ సినిమాకి సైన్ చేశాను" అని చెప్పింది. తమిళంలో సమంత చేసిన పాత్రను కాజల్ చేయనుండగా, ఎమీ జాక్సన్ పాత్రలో కేథరిన్ కనిపించనుంది. చాలా గ్యాప్ తరువాత సంతోష్ శ్రీనివాస్ చేస్తోన్న ఈ సినిమా ఆయనకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.