తెరపైకి మరో బయోపిక్ ..గజదొంగగా నాని?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెరపైకి మరో బయోపిక్ ..గజదొంగగా నాని?

  • తెలుగులో బయోపిక్ ల జోరు 
  • ఉయ్యాలవాడతో సెట్స్ పై చిరూ 
  • కోడి రామ్మూర్తినాయుడుగా రానా  
తెలుగులో బయోపిక్ ల జోరు ఊపందుకున్నట్టుగా కనిపిస్తోంది. సావిత్రి బయోపిక్ గా వచ్చిన 'మహానటి' భారీ విజయాన్ని సాధించగా, ఎన్టీఆర్ .. వైఎస్సార్ .. కాంతారావు .. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి .. కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లు లైన్లో వున్నాయి. కోడి రామ్మూర్తి నాయుడు .. స్టూవర్టుపురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లు చేయడానికి రానా కొన్ని రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అంతకుముందే రానా కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకుని ఉండటం వలన .. ఒకేసారి రెండు బయోపిక్ లు చేయవద్దనే ఉద్దేశంతో తాజాగా 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ నుంచి రానా తప్పుకున్నాడట. ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన టైగర్ నాగేశ్వరరావు .. చివరికి ఒక భారీ ఎంకౌంటర్లో చనిపోయాడు. ఆయన బయోపిక్ నుంచి రానా తప్పుకోవడంతో, దర్శక నిర్మాతలు నానిని సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. 'కిట్టువున్నాడు జాగ్రత్త'ను తెరకెక్కించిన వంశీకృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.  
rana
nani

More Telugu News