రిలయన్స్ బిగ్ టీవీ కొత్త ఆఫర్... రూ.2,000కే ఏడాది పాటు అన్నీ ఫ్రీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిలయన్స్ బిగ్ టీవీ కొత్త ఆఫర్... రూ.2,000కే ఏడాది పాటు అన్నీ ఫ్రీ

  • ఇన్స్ టలేషన్ చార్జీలు రూ.250
  • దాంతో ఏడాది పాటు హెచ్ డీ సహా అన్ని చానల్స్ వీక్షించే వీలు
  • ఏడాది తర్వాత ప్రతీ నెలా రూ.300తో రీచార్జ్
డిష్ టీవీ సేవలు అందించే రియలన్స్ బిగ్ టీవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రూ.500తో పోస్టాఫీసుకు వెళ్లి రిలయన్స్ బిగ్ టీవీ కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంస్థ తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉంటుంది. లేదా రిలయన్స్ బిగ్ టీవీ వెబ్ సైట్ నుంచి కూడా ఇంతే మొత్తం చెల్లించి కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వారికి జూలై 30 నాటికి వారింటి వద్ద సెట్ టాప్ బాక్స్ లను ఇన్ స్టాల్ చేస్తుంది.  

తొలుత రూ.500తో బుక్ చేసుకున్న వారు సెట్ టాప్ బాక్స్ ఇన్స్ టలేషన్ సమయంలో మరో రూ.1,500 చెల్లించుకోవాలి. ఇన్స్ టలేషన్ చార్జీలు మరో రూ.250 అదనం. దాంతో ఏడాది పాటు పెయిడ్ చానల్స్, ఫ్రీ చానల్స్, హెచ్ డీ చానల్స్ అన్నీ ఉచితంగా వీక్షించొచ్చు.  కాకపోతే ఏడాది దాటిన తర్వాత నుంచి ప్రతీ నెల రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటేనే పెయిడ్ చానల్స్ చూడగలరు. అలా రెండేళ్ల పాటు ప్రతీ నెలా రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటే ఆ తర్వాత రూ.2,000 ను లాయల్టీ బోనస్ గా కంపెనీ వెనక్కిచ్చేస్తుంది.
reliance big tv offer

More Telugu News