పార్టీలోని మహిళలకూ లైంగిక వేధింపులు: ఇమ్రాన్ ఖాన్ పై మాజీ భార్య రెహమ్ తీవ్ర వ్యాఖ్యలు
- సెక్సువల్ ఫేవర్స్ చేసే మహిళలకు పార్టీలో ప్రయోజనాలు
- ఇమ్రాన్ గెలిస్తే.. దేశాన్ని తీవ్రవాదులకు అప్పగిస్తాడు
- ఆయన పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలి
తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ లో మహిళలపై ఇమ్రాన్ లైంగిక వేధింపులు ఉంటాయని పుస్తకంలో పేర్కొన్నారు. సెక్సువల్ ఫేవర్స్ చేసే మహిళలకు పార్టీలో ఉండే ప్రయోజనాలను ఆమె వివరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే, దేశాన్ని తీవ్రవాదులకు అప్పగిస్తాడని తెలిపారు. ఇమ్రాన్ పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇమ్రాన్ ఖాన్ వల్ల తాను అనుభవించిన ఎన్నో ఘటనలను పుస్తకంలో వివరించారు. జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ తో కేవలం 10 నెలలు మాత్రమే సంసారం చేశారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.