కొలువుల జాతర.. తెలంగాణ మార్కెటింగ్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్కారు ఆమోదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొలువుల జాతర.. తెలంగాణ మార్కెటింగ్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్కారు ఆమోదం

  • ఇటీవలే రెండు నోటిఫికేషన్లు
  • మార్కెటింగ్‌ శాఖలో మరో 200 ఉద్యోగాలు
  • టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఈనెల 2న టీఎస్‌పీఎస్సీ 2,786 పోస్టులతో ఐదు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం తెలంగాణ పోలీస్‌ నియామక సంస్థ 18,428 పోలీసు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్‌ ఇచ్చింది. తాజాగా, తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. మార్కెటింగ్‌ శాఖలో 200 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్‌ కార్యదర్శి, 80 అసిస్టెంట్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌, 13 గ్రేడర్‌, 9 బిడ్‌ క్లర్క్‌, 60 జూనియర్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపింది. ఈ నియామకాల ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ ద్వారా పూర్తి చేస్తారు.      
Telangana
jobs
tspsc

More Telugu News