Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దేవి' షూటింగు సమయంలో ఆ కుర్రాడిని పాము కరిచేసింది: కోడి రామకృష్ణ

  • ఎన్నో భక్తి చిత్రాలను తెరకెక్కించాను 
  • షూటింగు సమయంలో నిష్ఠగా వుంటాను 
  • యూనిట్లో అంతా అలా ఉండేలా చూసుకుంటాను
ఒక వైపున సాంఘిక చిత్రాలను .. మరో వైపున భక్తిరసాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ కోడి రామకృష్ణ ఎన్నో విజయాలను అందుకున్నారు. అలాంటి ఆయన తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'దేవి' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. " సాధారణంగా నేను భక్తి చిత్రాలను రూపొందించేటప్పుడు నియమ నిష్ఠలను పాటిస్తూ వుంటాను. యూనిట్లో ఎవరూ కూడా నాన్ వెజ్ తినకుండా .. డ్రింక్ చేయకుండా చూసుకుంటాను. నేను చెప్పిన నియమాలను అందరూ పాటించేవారు.

'దేవి' సినిమాలో పాముకి ప్రాముఖ్యత ఎక్కువ .. నాకేమో పాము అంటే భయం. అసలు పాములు ఆడించే వ్యక్తి తన అసిస్టెంట్ కి ఆ పాములను అప్పగించి వెళ్లాడు. వాటిలో ఒక పాముకు గోల్డ్ కలర్ వేయాలి. ఏ పాముకు ఆ కలర్ వేయాలనే విషయం చెప్పేసి అసలాయన వెళ్లిపోయాడు. ఆ అసిస్టెంట్ ఆ సంగతి మరిచిపోయి .. కొత్తగా పట్టిన పాముకు గోల్డ్ కలర్ వేశాడు. ఆ సమయంలో అది వాడిని కరవడం .. వాడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగిపోయాయి. ఒక నియమం తప్పడం వల్లనే అలా జరిగిందని నేను .. ఆ సినిమా నిర్మాత గ్రహించాము" అంటూ చెప్పుకొచ్చారు. 
kodi ramakrishna

More Telugu News