ఐఫోన్ మాదిరిగా ఉండే లెనోవో జెడ్ 5... ధర రూ.14,000లోపే
- రెండు రకాల వేరియంట్లు
- 6 జీబీ ర్యామ్, 64 జీబీ, 128జీబీ స్టోరేజీ
- బాడీలో స్క్రీన్ 90 శాతం
స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.2 అంగుళాల పుల్ హెచ్ డీ+ డిస్ ప్లేతో ఉంటుంది. ఫోన్ మొత్తంలో స్క్రీన్ రేషియో 90 శాతం. డిస్ ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.0పై పనిచేస్తుంది. క్వాల్ కామ్ 636 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. 3,000 ఎంఏహెచ్, వెనుక భాగంలో 16+8ఎంపీ మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరా, 4కే వీడియో ఫీచర్లు ఉన్నాయి. యూఎస్ బీ టైప్ సీ పోర్టు, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.