మోదీ, అమిత్ షాలను సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంది.. అదృష్టం బాగుండి తప్పించుకున్నారు: మాజీ డీఐజీ వంజారా
- ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసు
- 2014లో మోదీ, అమిత్ షాలకు క్లీన్ చిట్
- విచారణను ఎదుర్కొంటున్న మాజీ డీఐజీ వంజారా
అప్పటి ఘటన వివరాల్లోకి వెళ్తే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఇష్రాత్ జహాన్ తో పాటు ఆమె స్నేహితులు జావెద్ అలియాస్ ప్రాణేశ్, పాకిస్థాన్ కు చెందిన జీహాన్ జొహార్, అంజాద్ రాణా అనే యువకులను ఒక టెర్రరిస్ట్ టీమ్ గా పోలీసులు అనుమానించారు. దీంతో, అప్పటి డీఐజీ వంజారా నేతృత్వంలో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేసి చంపారు. అయితే, వారు టెర్రరిస్టులు కాదనే విషయం సీబీఐ విచారణలో తేలింది. వంజారా కుట్రపూరితంగా వారిని చంపారని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, కేసు నుంచి తమను విముక్తి చేయాలంటూ వంజారాతో పాటు మరో పోలీసు ఉన్నతాధికారి అమిన్ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది.