Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డేటింగ్ కావాలని తొందరపడుతున్న అమ్మాయిలు: నార్వే వర్శిటీ పరిశోధన

  • 10 నుంచి 29 సంవత్సరాల యువతపై పరిశోధన
  • 'టిండర్'ను అధికంగా వాడుతున్న అమ్మాయిలు
  • ఓ నిర్ణయానికి వస్తే కట్టుబడే వుంటున్న వైనం
  • అబ్బాయిలు మాత్రం అందుకు రివర్స్
అబ్బాయిలతో పోలిస్తే, అమ్మాయిలే డేటింగ్ కోసం తొందరపడుతున్నారట. నార్వే కేంద్రంగా నడుస్తున్న నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు డేటింగ్ ట్రెండ్స్ పై పరిశోధన చేస్తూ, 10 నుంచి 29 సంవత్సరాల వయసులోని అమ్మాయిలను, అబ్బాయిలను ఆరా తీసి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. డేటింగ్ కోసం షార్ట్ కట్స్ కావాలని యువత కోరుకుంటోందని, వీరికి అందుబాటులో ఉన్న 'టిండర్' అనే యాప్ హాట్ ఫేవరెట్ అని తేల్చారు. 'టిండర్' ను అమ్మాయిలే అధికంగా వాడుతున్నారని, అయితే, అబ్బాయిల వ్యక్తిగత వివరాలు, వృత్తి నేపథ్యాలను పరిశీలించిన తరువాతే వారు ఓ నిర్ణయానికి వస్తున్నారని వెల్లడించారు. ఆ తరువాత తాము తీసుకున్న నిర్ణయం ఎటువంటిదైనా కట్టుబడే ఉంటున్నారని తెలిపారు.

అబ్బాయిల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, ఒకేసారి ఎక్కువ మందిని పరిచయం చేసుకుంటున్నారని, వారిని ఎప్పుడు కలవాలా? అన్న ఆరాటం అబ్బాయిల్లో ఎక్కువగా ఉందని తేల్చారు. షార్ట్ టర్మ్ రిలేషన్ షిప్, లైంగిక కోరికలు తీర్చుకునేందుకే ఈ యాప్ ను అత్యధికులు ఆశ్రయిస్తున్నారని ప్రొఫెసర్ల అధ్యయనంలో తేలింది. ఒకరు నచ్చకుంటే, వెంటనే మరొకరికి ప్రపోజ్ చేసే విషయంలోనూ అబ్బాయిలే ముందుంటున్నారట. అయితే, అతి కొద్ది మంది మాత్రం తమకు నచ్చే అమ్మాయి దొరికే వరకూ నిరీక్షిస్తున్నారని, వీరిలో కొందరు మనసుకు నచ్చిన వారితో వివాహ బంధంలోకి వెళుతున్నారని కూడా తెలిపారు.
Dating
Ladies
Gents
Tinder
App

More Telugu News