బిజినెస్ విషయంలో 'కబాలి'ని అధిగమించిన 'కాలా'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిజినెస్ విషయంలో 'కబాలి'ని అధిగమించిన 'కాలా'

  • రజనీ హీరోగా రూపొందిన 'కాలా'
  • శాటిలైట్ హక్కుల రూపంలో 70 కోట్లు 
  • ఈ నెల 7వ తేదీన భారీ విడుదల
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ రోజు కోసం రజనీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'కబాలి'తో పోలిస్తే చాలా ప్రాంతాల్లో 'కాలా' థియేట్రికల్ రైట్స్ తక్కువ రేటుకే పలికాయి. అయితే శాటిలైట్ రైట్స్ రూపంలో భారీగా కలిసిరావడంతో, 'కబాలి' కంటే పై స్థానంలో 'కాలా' నిలిచింది. 'కబాలి' 218 కోట్ల బిజినెస్ చేయగా .. 'కాలా' బిజినెస్ 230 కోట్ల మార్క్ ను అందుకుంది.

యూఎస్ తో పాటు జపాన్ .. సింగపూర్ .. మలేసియా వంటి దేశాల్లోను రజనీ సినిమాలకి ఎంతో క్రేజ్ వుంది. అందువలన ఓవర్సీస్ లో ఈ సినిమా 'కబాలి' కంటే 10 కోట్లు అదనంగా రాబట్టింది. శాటిలైట్ హక్కుల రూపంలో ఈ సినిమాకి 70 కోట్లు రావడంతో .. ఓవరాల్ బిజినెస్ 230 కోట్లకి చేరుకుంది.  
rajani
huma

More Telugu News