Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొందరపడి ఆ డైరెక్టర్ మాట్లాడాడు .. ఆ తరువాత సారీ చెప్పాడు: నటి సుధ

  • వేరే సినిమా షూటింగ్ ఉందని ముందే చెప్పాను 
  • ఆ సమయానికి పంపిస్తామన్నారు
  • గుర్తుచేస్తే ఆ డైరెక్టర్ కి కోపం వచ్చేసింది
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటి సుధ మాట్లాడుతూ .. తన కెరియర్లో జరిగిన ఒక సంఘటనను గురించి ఇలా చెప్పుకొచ్చారు. "నేను ఒక సినిమా షూటింగులో వున్నాను .. నైట్ వేరే సినిమా షూటింగు వుంది .. 7 గంటలకి వెళ్లిపోవాలని ప్రొడక్షన్ వాళ్లకి ముందుగానే చెప్పాను. అలాగే పంపిస్తామని వాళ్లు చెప్పారు .. కానీ 11 గంటలు కావొస్తున్నా పంపించడం లేదు.

కో డైరెక్టర్ ను పిలిచి .. వేరే షూటింగ్ వున్న విషయం చెప్పాను. ఆ మాటలు విన్న డైరెక్టర్ .. నేను బయటికి చెప్పలేని ఒకమాట అన్నాడు. దాంతో ఆయనను చూసి ఆ సినిమాను ఒప్పుకోలేదని చెప్పేసి నేను నా రూముకి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాను. ఆ దర్శకుడు సెల్వరాఘవన్ .. ఆ సినిమా నిర్మాత ఎ.ఎం.రత్నం. నా రూముకు రత్నం గారు వచ్చి నచ్చజెప్పి పంపించారు.

తెలుగు వెర్షన్ డబ్బింగ్ సమయంలో సెల్వరాఘవన్ అక్కడుంటే డబ్బింగ్ చెప్పనని నేను అన్నాను. రత్నం గారు వుండి నాతోనే చెప్పించారు. తమిళ వెర్షన్ డబ్బింగ్ కి నేను వస్తే తాను ఉండనని సెల్వరాఘవన్ అన్నాడట. వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించి .. కుదరకపోవడంతో మళ్లీ నాతోనే చెప్పించాడు .. ఆ తరువాత జరిగిన దానికి సారీ చెప్పాడు" అన్నారు.    
sudha
selva raghavan

More Telugu News