సినీ నటి అపూర్వకు చెందిన భూమి కబ్జా.. పోలీసులకు ఫిర్యాదు!

  • పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నాలుగెకరాల భూమి కబ్జా
  • పోలీసులను ఆశ్రయించిన అపూర్వ
  • రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్న పోలీసులు
తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారంటూ సినీ నటి అపూర్వ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, దెందులూరులో తనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇటీవలే తమ భూమిని సర్వేయర్ తో సర్వే చేయించి సరిహద్దుల్లో రాళ్లు పాతించామని చెప్పారు. మరుసటి రోజే చుట్టు పక్కల ఉన్న రైతులు ఆ రాళ్లను తొలగించి, భూమిని ఆక్రమించారని తెలిపారు. ఈ కబ్జా వ్యవహారంపై పోలీసులు మాట్లాడుతూ, ఇది సివిల్ వ్యవహారమని, భూమి సరిహద్దుల విషయాన్ని ఎమ్మార్వో చూసుకుంటారని చెప్పారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
Go Back to Shorts
apoorva
actress
tollywood
land
grabbing

More Telugu News