Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏం చేద్దాంరా నాని?: శ్రీరెడ్డి కామెంట్

  • బిగ్ బాస్-2కు కౌంట్ డౌన్ స్టార్ట్
  • శ్రీరెడ్డి కూడా పార్టిసిపేట్ చేయబోతోందని సమాచారం
  • నానిని ఉద్దేశించి ఫేస్ బుక్ లో కామెంట్ చేసిన శ్రీరెడ్డి
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్2కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తొలి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోయే వారి పేర్లు కొన్ని బయటకు వచ్చాయి.

 ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నటి శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్-2లో పార్టిసిపేట్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. నానిపై కూడా శ్రీరెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజాగా శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

'నానికి, నాకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఏం చేద్దాంరా నాని?' అంటూ ఆమె ఫేస్ బుక్ లో కామెంట్ చేసింది. బిగ్ బాస్ ను ఉద్దేశించే ఆమె ఈ కామెంట్ చేసినట్టు అర్థమవుతోంది.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fiamsrireddy%2Fposts%2F2120158641564390&width=500" width="500" height="199" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>
sri reddy
nani
bigboss
season 2
tweet

More Telugu News